మా బడి ఉపాధ్యాయ బృంద సమిష్టి కృషితో , బ్లాగర్ మిత్రుల సహాయ సహకారంతో మరియు మార్గదర్శకత్వంతో , బడి ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున గారు, గ్రామ సర్పంచ్ రామన్న గారు మరియు లాయర్ శేషాద్రి గారు సమన్వయ సహకారంతో, ఆర్డీవో రామారావు గారి ప్రోస్తాహంతో, ఈ సంవత్సరం మా బడిలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, వివిధ పాటశాలల నుండి వచ్చిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులకు, అలాగే మా మిత్రులు డిగ్రీ కళాశాల బోటనీ అధ్యాపకులు అక్బర్ మరియు వారి అధ్యాపక బృందానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తలపెట్టిననాటి నుంచి ముగిసేవరకూ ఎక్కడో ఖండాంతరాలలో వున్నా అనునిత్యం ఫోన్ ద్వారా మార్గ నిర్దేశనం చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తన వంతు పాత్ర వహించిన బ్లాగర్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరం ఈ జాతీయ సైన్సు దినోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకుంటామని తెలియచేసుకుంటూ ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి