13, మార్చి 2016, ఆదివారం

పిల్లలు మరియు ఉపాధ్యాయులు తయారుచేసిన సైన్స్ నమూనాల ప్రదర్శన చిత్రమాలిక - మా బడిలో జాతీయ సైన్స్ దినోత్సవం 2016 సందర్భంగా .....

జాతీయ సైన్స్ దినోత్సవం 2016 సందర్భంగా ..... మా బడిలో పిల్లలు మరియు మేము అనగా సైన్స్  ఉపాధ్యాయులు కలిసి కొన్నిరోజుల ముందునుంచి సైన్స్ నమూనాలు తయారు చేయడం మొదలెట్టాము. నమూనాల ద్వారా పిల్లలకు సైన్సు పరిజ్ఞానం మరింత పెరుగుతుంది అన్న విషయంలో అతిశయోక్తి ఏమీలేదు. నమూనాల ద్వారా బోధించడం ద్వారా పిల్లలకు విషయాన్ని చక్కగా చెప్పవచ్చు, అలాగే పిల్లలు నమూనాలను చూసి స్వంతంగా  కొన్ని వాక్యాలు చక్కగా చెప్పగలరు మరియు వ్రాయగలరు. బట్టీ బోధనాభ్యసన నుంచి పిల్లలను దూరం  చేసి వారిని    సృజనాత్మక బోధనాభ్యసనకు చేరువచేయడానికి  ఈ నమూనాలు ఎంతగానో దోహదపడుతాయి. అందుకే పిల్లలకు అదివరకు లేని నమూనాల తయారి అలవాటును స్వయంగా ఉపాధ్యాయులం మేము చేసి చూపి వారిచేత చేయించడం జరిగింది. అలా తయారుచేసిన నమూనాలను జాతీయ సైన్స్ దినోత్సవం 2016 సందర్భంగా ప్రదర్శనకు ఉంచడం జరిగింది.
ఈ నమూనాలతో బాటు కల్యాణదుర్గం లోని వాసవి కాఫీ వర్క్స్  నాగరాజు గారి నుండి వారు సేకరించిన వివిధ దేశాల నాణేలు మరియు వివిధ రకాల స్వదేశీ నాణేలు ప్రదర్శనకు వుంచడం జరిగింది. దీనివల్ల పిల్లలకు ఒక హాబీ ని పరిచయం చేసి వారిని కూడా వివిధ రకాల హాబీలు అలవరచుకోమని చెప్పడం జరిగింది. ఈ సైన్స్  నమూనాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆరంభించిన గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారికి మరియు మా బడికి మానవ జీర్ణవ్యవస్థ నమూనాను తన కుమార్తె పేరుమీదుగా ఇచ్చిన శ్రీ  గోళ్ళ శేషాద్రి (లాయరు) గారికి, మా బడి పిల్లలకు హాబీలను పరిచయం చేయడానికి తాము సేకరించిన వివిధ దేశాల నాణేలను మా బడిలో ప్రదర్శనకు ఉంచడానికి ఇచ్చిన వాసవి కాఫీ వర్క్స్ నాగరాజు గారికి, ఈ ప్రదర్శనను తిలకించడానికి విచ్చేసిన శెట్టూరు, కల్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు  మండల ప్రధానోపాధ్యాయులకు , ఉపాధ్యాయులకు , విద్యార్థినీ విద్యార్థులకు  , పని ఒత్తిడిలో వున్నా మా పై ప్రత్యేక అభిమానంతో  వచ్చిన మా మిత్రులు  అక్బర్ వారి అధ్యాపక బృందంకు , లేపాక్షి ఉత్సవాల పనులలో అలసిపోయినా.. మమ్మల్నీ,   మా బడి పిల్లలను ప్రోస్తహించడానికి తీరిక చేసుకొని మరీ ఈ కార్యక్రమానికి వచ్చిన  ఆర్డీవో శ్రీ రామారావు గారికి , ఎమ్మార్వో మేడం గారికి , పాత్రికేయులకు , మామూలు పంథాలో జరిగే సైన్సు ప్రదర్శనలకు భిన్నంగా మా బడిలో సైన్స్ ప్రదర్శన  నిర్వహించడానికి సహాయ సహకారాలు మరియు అమూల్యమైన సూచనలు ఇచ్చిన విదేశీ, స్వదేశీ బ్లాగర్ మిత్రులకు మా బడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి  అందరికీ పేరుపేరునా  ధన్యవాదాలు. విద్యార్థినీ విద్యార్థులకు శుభాసిస్సులు.



































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి