21, మార్చి 2016, సోమవారం

మా బడిలో పర్యావరణ పరిరక్షణ కొరకు "హరిత సేన" ఏర్పాటు చిత్రమాలిక - జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు -2016 సందర్భంగా

మా బడిలో పర్యావరణ పరిరక్షణ కొరకు "హరిత సేన" ఏర్పాటు చేయాలని సైన్సు క్లబ్ లో సైన్సు ఉపాధ్యాయులు, పిల్లలు అనుకొని ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకొన్నాం. మా బడిలో  హరిత సేన ఏర్పాటులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం బడి పిల్లలందరూ కృషి చేయాలనీ, అలా విశేష కృషి చేసిన వారిలో అబ్బాయిలకు "యంగ్ ఎకో సేవియర్ " (YES: Young Eco Saviour) అవార్డులను, అమ్మాయిలకు "గ్రీన్ ఎన్విరాన్మెంట్ మెంబర్"(GEM: Green Environment Member) అవార్డులను ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ అవార్డులు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు ముదురు నారింజ రంగు టోపీలను, ఆకుపచ్చ  రంగు షోల్డర్ కెర్చీఫ్ లను, స్టార్లను, త్రివర్ణ బ్యాడ్జీలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాము.  ఇలా ఇవ్వడం ద్వారా వారికొక గుర్తింపు ఇచ్చినట్లుంటుంది మరో రకంగా వారి బాధ్యతలను రెట్టింపు చేసి వారిలో చదువుతో బాటుగా పర్యావరణ పరిరక్షణ అనే సామాజిక బాధ్యతను పెంపొందిచినట్లవుతుంది అని భావించడం జరిగింది. అనుకున్నదే తడవుగా బడి నిధులనుంచి కొంత డబ్బుతో బెంగుళూరులో వుండే మా  బంధువులబ్బాయి వినోద్ ను సంప్రదించగా అతను తాను వుండే ప్రాంతం నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే  నేను చెప్పిన  షాప్ కెళ్ళి, నా ఫోన్ సూచనలకు అనుగుణంగా(వాట్సాప్ ద్వారా) తక్కువ ధరకే టోపీలను, స్టార్లను , త్రివర్ణ బ్యాడ్జీలను కొనుగోలు చేసి నాకు జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలకు చాలా ముందుగానే అందేటట్లు చేసాడు. అలాగే ఆకుపచ్చ రంగు గుడ్డను షోల్డర్ కెర్చీఫ్ లుగా కుట్టి ఇవ్వడంలో ఉపాధ్యాయ మిత్రుడు పర్వతయ్య  సహకరించారు.  వినోద్ కు మరియు పర్వతయ్య గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. జాతీయ సైన్సు దినోత్సవ వేడుకల రోజున కొందరు ఎంపిక చేయబడ్డ విద్యార్థినీ విద్యార్థులకి గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న, లాయరు శ్రీ శేషాద్రి, శెట్టూరు  ఏ పీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ శ్రీరాములు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ నాగరాజు గార్ల చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
భవిష్యత్తులో బడిలోని పిల్లలందరికీ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించి వారు దాని కోసం నడుం బిగించేలా చేసి  బడిలోని విద్యార్థినీ విద్యార్థులందరికీ  ఈ అవార్డులు ఇచ్చి అందరి  పిల్లలను ఈ హరిత సేనలో భాగస్వామ్యులయ్యేటట్లు చేసి హరితాంధ్రప్రదేశ్ సాధనలో మా వంతు భాద్యత నేరవేర్చేలా అడుగులు వేస్తున్నాము....













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి