21, మార్చి 2016, సోమవారం

సాంస్కృతిక మరియు భోజన కార్యక్రమాల చిత్రమాలిక - మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు - 2016 సందర్భంగా ....

మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు - 2016 సందర్భంగా  ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూడడానికి  మా బడి పిల్లలు కాకుండా మండల పరిధిలోని వివిధ బడులనుండి(ఎర్రంపల్లి, ఎర్రబోరే పల్లి, ముచ్చర్ల పల్లి  ప్రాథమికోన్నత పాటశాలలు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు, ములకలేడు, చెర్లోపల్లి ఉన్నత పాటశాలలు)   సుమారు 450 మంది పిల్లలు, సుమారు 70 మంది పెద్దలు ( ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు) వచ్చారు.  వీరందరికీ  సాదరంగా  స్వాగతం పలికి, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూసే ముందు ,  చూసిన తరువాత మంచి నీళ్ళు, కాఫీ, భోజనాలు ఏర్పాటు చేయడంలో మా ఉపాధ్యాయ బృందం (సోమశేఖర్ గారు, సూరిబాబు గారు, శ్రీనివాసులు గారు, నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మన్న గారు, సురేష్ బాబు గారు) మాజీ విద్యా వాలంటీర్ బషీర్ గారు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు మర్రిస్వామి గారు, మా మిత్రుడు పర్వతయ్య గారు గ్రామస్తులు కొందరు, వాలంటీర్ పిల్లలు   ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నారు. వీరిని ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున గారు చక్కగా సమన్వయ పరిచారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూసిన తరువాత భోజనాలు చేసే వరకు పిల్లల్ని, ఉపాధ్యాయులను సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడంలో మా ఉపాధ్యాయులు నాగేంద్ర గారు, కనుకూరు ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు నాగరాజు గారు ముఖ్య భూమిక నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పిల్లల్ని మా బడిలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూపించడానికి ఓపికతో పిల్చుకొని వచ్చిన ఉపాధ్యాయులకు, అందుకు అనుమతి ఇచ్చిన ఆయా బడుల  ప్రధానోపాధ్యాయులకు ఈ సందర్భంగా మా బడి తరఫున  ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను 











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి