24, నవంబర్ 2015, మంగళవారం

"ఇది వితరణ కాదు నా విద్యుద్ధర్మం " అంటూ నాబడి నూతన ఒరవడికి బాసటగా నిలిచిన ఎన్నారై మిత్రుడు, సోదరుడు, మార్గదర్శి ( బ్లాగర్ )

గతంలో మా బడి పిల్లలకి రెమ్మలు రమ్మన్నాయి అనే భారతీయ విఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ జీవిత చరిత్ర పుస్తకాలను వితరణ గా ఇచ్చిన ఎన్నారై  బ్లాగర్ మిత్రుడు ఇప్పుడు నేను గతంలో పనిచేసిన రేగడి కొత్తూరు బడి పిల్లలకోసం విలువైన గ్రంథాలయ పుస్తకాలను వితరణగా ఇచ్చారు. సార్! మీ అమూల్యమైన సూచనలు, ప్రోస్తాహం, మార్గదర్శనం చాలు,  మీ డబ్బులతో పుస్తకాలు పంపకండి  మీ సూచనల ప్రకారం పిల్లలకి కావాల్సిన పుస్తకాలను నేనే స్వయంగా ఇవ్వడమో లేదా వారిచేతనే  కొనిపించ డమో చేస్తాను లేదా స్థానిక వనరుల ద్వారా ఏర్పాటు చేస్తాను అంటే ఆ  ఎన్నారై మిత్రుడు ఇలా అన్నారు సార్!... ఇది నేను చేసే వితరణ కాదు నా విద్యుద్ధర్మమ్ "ఇట్ ఈస్ నాట్ చారిటి, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటి", బాధ్యత  అన్నారు . పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు కావాలంటే ఖచ్చితంగా పుస్తకాలను చదవలంటారు ఇతను. నేడు పిల్లలు తలవంచి పుస్తకాలు చదివితే రేపు తల ఎత్తుకోని తిరిగే భావి పౌరులౌతారని దేశం గర్వించే మరియు జాతిని నిర్మించే వారౌతారని చెబుతారు, నమ్ముతారు  ఇతను. ఏ పుస్తకం ఏ పిల్లవాన్ని మార్చుతుందో మనకేం తెలుసు, గొప్పవాల్లంతా పుస్తకాలు చదవడం వల్లనే అలా కాగలిగారని అందుకే పిల్లల్ని  మంచి కథల పుస్తకాలు, స్పూర్తిని నిచ్చే పుస్తకాలు చదివేటట్లు ప్రోస్తహించాలని చెబుతారు ఇతను. చెప్పడమే కాకుండా మా బడికి విలువైన గ్రంథాలయ పుస్తకాలను మంచి పుస్తకం ప్రచురుణ కర్తల ద్వారా వితరణ గా ఇచ్చి దాన్ని తన బాధ్యత గా భావిస్తూ  నా నూతన ఒరవడికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా  ఎన్నారై మిత్రునికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ........ వారి కలలను(మా కలల్ని కూడా) ఆశయాన్ని(మా ఆశ యాలని) నిజం చేయడానికి కృషిచేస్తానని మాటిస్తూ ......
వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలు 
వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల పార్సిల్ 


వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ సమావేశం 

 గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ సమావేసంలో మాట్లాడుతున్నా మండల విద్యా శాఖాధికారి శ్రీ గురుప్రసాద్ గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి ప్రధానోపాధ్యాయులకు అందచేస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు 


వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలన బడి ఉపాధ్యాయులు శ్రీ సర్దార్ వలి గారికి  అందచేస్తున్న గ్రామస్తులు  

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి ఉపాధ్యాయుడైన హరిహర గారికి  అందచేస్తున్న బడి అభివృద్ధి కమిటి చైర్మన్మం రామకృష్ణారెడ్డి గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి కమిటి ఉపాధ్యాయులు శ్రీ చింతా లక్ష్మీనారాయణ గారికి  అందచేస్తున్న గ్రామ పెద్ద శ్రీ సీతారామిరెడ్డి గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల గురించి వివరిస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల గురించి వివరిస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు

గ్రంథాలయ పుస్తకాల ప్రాముఖ్యతని  గురించి వివరిస్తున్న  ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహులు  గారు

 గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు మరియు పిల్లలు 



1 కామెంట్‌: