23, జనవరి 2016, శనివారం

మేమూ రాకెట్ ఇంజనీర్లౌతామంటున్న మా బడి పిల్లలు, ఆ దిశగా వారి తొలి అడుగులు

మన అబ్దుల్ కలాం గారి స్పూర్తి తో  భారతదేశంలో ఇటీవల శ్రీహరికోట నుండి ఇస్రో శాస్త్రవేత్తలు పి. యస్. ఎల్. వి. రాకెట్ ద్వారా ప్రయోగించిన ఐ.ఆర్.యన్.యస్.యస్.1ఇ శాటిలైట్ గురించి పిల్లలకు వివరించి రెండు నిమిషాల నిడివి  గల దాని వీడియోని చూపించి ఆ శాటిలైట్ వల్ల మన దేశానికి  కలిగే  ఉపయోగాలు తెలియచేసి వారికి రాకెట్ అంటే ఏమి, శాటిలైట్ అంటే ఏమి, మిస్సైల్ అంటే ఏమి మొదలైన విషయాలు తెలియచేయడం జరిగింది.అలాగే  పి.యస్.ఎల్.వి. రాకెట్లకి  జి.యస్.ఎల్.వి.   రాకెట్లకి మధ్య గల తేడాలను వివరించి బ్లాక్ బోర్డ్ మీద రఫ్ గా రాకెట్ బొమ్మ వేసి చూపించడం జరిగింది,  అలాగే మనం త్వరలో జరుపుకోబోయే జాతీయ సైన్స్ దినోత్సవం సదర్భంగా మనం రాకెట్ నమూనాలు చేద్దామని చెప్పాను. దీనితొ ప్రేరణ పొందిన పిల్లలు మరుసటి రోజు తమకు తోచినవిధంగా కలబంద చెట్ల ఆకులతో, పాత అట్టలతో  రాకెట్ నమూనాలు చేసుకొచ్చారు. ఎటువంటి ఆధునిక సదుపాయలు లేని మారు మూల పల్లెలో నివసించే వారి సృజనకు  ఆశ్చర్య పోయిన నేను వారికి మరి కొన్ని సూచనలిచ్చి మరింత మెరుగైన రాకెట్ నమూనలను తయారుచేయమన్నాను. త్వరలో సరికొత్త రాకెట్ నమూనలను చేసుకొస్తామని ధీమాగ చెప్పారు ఆ చిచ్చరపిడుగులు వాటి  చిత్రాలే  ఇవి చూడండి.. 











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి