రక రకాల పావురాలని పెంచడం, వాటికి ఆహారం వేయడం, పొదిగొచ్చిన పావురం పిల్లల్ని పెంచడం, పావురాలతో పందెములు వేయడం పిల్లలుండే గ్రామములో పెద్దవారికి ప్రవృత్తి. ఈ విషయాలన్నీ మా బడి పిల్లలు దగ్గరగా చూస్తున్నరన్న విషయం తెలిసిన నేను వారితొ పావురాల మీద ఒక ప్రాజెక్టు చేయమన్నాను దానితొ వారికి ఇష్టమైన ప్రాజెక్టు దొరికింది. పిల్లలు పావురాల్ని గమనిచడం అవి ఏ రకమైన పావురమో గుర్తించడం, వాటి ఆహారపు అలవాట్లను పరిశీలించడం, అవి ఎన్ని గుడ్లు పెడతాయి, ఎన్ని రొజులు పొదుగుతాయి, పొదిగొచ్చిన పిల్లలు ఎన్ని రొజులకు రెక్కలొచ్చి ఎగురుతాయి, వాటికి పెద్దవారు పందెములకు ఎలా శిక్షణ ఇస్తారు, పందేలలో ఎలా పాల్గొనిపిస్తారు అనే అనేక ఆసక్తికర విషయాలు వారు తెలుసుకొని వచ్చి నాకు వారి స్వంత మాటలలో తెలియచెసారు ఒక చక్కటి నివేదిక రూపొందిచారు, అంతేకాదు మేమూ ఆర్నిథాలజిస్టులౌతామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు....
24, జనవరి 2016, ఆదివారం
23, జనవరి 2016, శనివారం
మేమూ రాకెట్ ఇంజనీర్లౌతామంటున్న మా బడి పిల్లలు, ఆ దిశగా వారి తొలి అడుగులు
మన అబ్దుల్ కలాం గారి స్పూర్తి తో భారతదేశంలో ఇటీవల శ్రీహరికోట నుండి ఇస్రో శాస్త్రవేత్తలు పి. యస్. ఎల్. వి. రాకెట్ ద్వారా ప్రయోగించిన ఐ.ఆర్.యన్.యస్.యస్.1ఇ శాటిలైట్ గురించి పిల్లలకు వివరించి రెండు నిమిషాల నిడివి గల దాని వీడియోని చూపించి ఆ శాటిలైట్ వల్ల మన దేశానికి కలిగే ఉపయోగాలు తెలియచేసి వారికి రాకెట్ అంటే ఏమి, శాటిలైట్ అంటే ఏమి, మిస్సైల్ అంటే ఏమి మొదలైన విషయాలు తెలియచేయడం జరిగింది.అలాగే పి.యస్.ఎల్.వి. రాకెట్లకి జి.యస్.ఎల్.వి. రాకెట్లకి మధ్య గల తేడాలను వివరించి బ్లాక్ బోర్డ్ మీద రఫ్ గా రాకెట్ బొమ్మ వేసి చూపించడం జరిగింది, అలాగే మనం త్వరలో జరుపుకోబోయే జాతీయ సైన్స్ దినోత్సవం సదర్భంగా మనం రాకెట్ నమూనాలు చేద్దామని చెప్పాను. దీనితొ ప్రేరణ పొందిన పిల్లలు మరుసటి రోజు తమకు తోచినవిధంగా కలబంద చెట్ల ఆకులతో, పాత అట్టలతో రాకెట్ నమూనాలు చేసుకొచ్చారు. ఎటువంటి ఆధునిక సదుపాయలు లేని మారు మూల పల్లెలో నివసించే వారి సృజనకు ఆశ్చర్య పోయిన నేను వారికి మరి కొన్ని సూచనలిచ్చి మరింత మెరుగైన రాకెట్ నమూనలను తయారుచేయమన్నాను. త్వరలో సరికొత్త రాకెట్ నమూనలను చేసుకొస్తామని ధీమాగ చెప్పారు ఆ చిచ్చరపిడుగులు వాటి చిత్రాలే ఇవి చూడండి..
24, నవంబర్ 2015, మంగళవారం
"ఇది వితరణ కాదు నా విద్యుద్ధర్మం " అంటూ నాబడి నూతన ఒరవడికి బాసటగా నిలిచిన ఎన్నారై మిత్రుడు, సోదరుడు, మార్గదర్శి ( బ్లాగర్ )
గతంలో మా బడి పిల్లలకి రెమ్మలు రమ్మన్నాయి అనే భారతీయ విఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ జీవిత చరిత్ర పుస్తకాలను వితరణ గా ఇచ్చిన ఎన్నారై బ్లాగర్ మిత్రుడు ఇప్పుడు నేను గతంలో పనిచేసిన రేగడి కొత్తూరు బడి పిల్లలకోసం విలువైన గ్రంథాలయ పుస్తకాలను వితరణగా ఇచ్చారు. సార్! మీ అమూల్యమైన సూచనలు, ప్రోస్తాహం, మార్గదర్శనం చాలు, మీ డబ్బులతో పుస్తకాలు పంపకండి మీ సూచనల ప్రకారం పిల్లలకి కావాల్సిన పుస్తకాలను నేనే స్వయంగా ఇవ్వడమో లేదా వారిచేతనే కొనిపించ డమో చేస్తాను లేదా స్థానిక వనరుల ద్వారా ఏర్పాటు చేస్తాను అంటే ఆ ఎన్నారై మిత్రుడు ఇలా అన్నారు సార్!... ఇది నేను చేసే వితరణ కాదు నా విద్యుద్ధర్మమ్ "ఇట్ ఈస్ నాట్ చారిటి, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటి", బాధ్యత అన్నారు . పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు కావాలంటే ఖచ్చితంగా పుస్తకాలను చదవలంటారు ఇతను. నేడు పిల్లలు తలవంచి పుస్తకాలు చదివితే రేపు తల ఎత్తుకోని తిరిగే భావి పౌరులౌతారని దేశం గర్వించే మరియు జాతిని నిర్మించే వారౌతారని చెబుతారు, నమ్ముతారు ఇతను. ఏ పుస్తకం ఏ పిల్లవాన్ని మార్చుతుందో మనకేం తెలుసు, గొప్పవాల్లంతా పుస్తకాలు చదవడం వల్లనే అలా కాగలిగారని అందుకే పిల్లల్ని మంచి కథల పుస్తకాలు, స్పూర్తిని నిచ్చే పుస్తకాలు చదివేటట్లు ప్రోస్తహించాలని చెబుతారు ఇతను. చెప్పడమే కాకుండా మా బడికి విలువైన గ్రంథాలయ పుస్తకాలను మంచి పుస్తకం ప్రచురుణ కర్తల ద్వారా వితరణ గా ఇచ్చి దాన్ని తన బాధ్యత గా భావిస్తూ నా నూతన ఒరవడికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్నారై మిత్రునికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ........ వారి కలలను(మా కలల్ని కూడా) ఆశయాన్ని(మా ఆశ యాలని) నిజం చేయడానికి కృషిచేస్తానని మాటిస్తూ ......
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల పార్సిల్ |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ సమావేశం |
![]() |
| గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ సమావేసంలో మాట్లాడుతున్నా మండల విద్యా శాఖాధికారి శ్రీ గురుప్రసాద్ గారు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి ప్రధానోపాధ్యాయులకు అందచేస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలన బడి ఉపాధ్యాయులు శ్రీ సర్దార్ వలి గారికి అందచేస్తున్న గ్రామస్తులు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి ఉపాధ్యాయుడైన హరిహర గారికి అందచేస్తున్న బడి అభివృద్ధి కమిటి చైర్మన్మం రామకృష్ణారెడ్డి గారు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి కమిటి ఉపాధ్యాయులు శ్రీ చింతా లక్ష్మీనారాయణ గారికి అందచేస్తున్న గ్రామ పెద్ద శ్రీ సీతారామిరెడ్డి గారు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల గురించి వివరిస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు |
![]() |
| వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల గురించి వివరిస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు |
![]() |
| గ్రంథాలయ పుస్తకాల ప్రాముఖ్యతని గురించి వివరిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహులు గారు |
![]() |
| గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు మరియు పిల్లలు |
11, నవంబర్ 2015, బుధవారం
టాగింగ్, టాగింగ్.... ఏ న్యూ వే అఫ్ లెర్నింగ్ నేమ్స్ అఫ్ ల్యాబ్ ఆపరేటస్
సైన్స్ లో ప్రయోగాలు చేయాలంటే విద్యార్థులు ప్రయోగశాల పరికరాలు వాడాలి, వాడాలంటే వాటి పేర్లు తెలిసివుండాలి , మరి పిల్లలకి వాటి పేర్లు తెలియక పొతే వాటిని ఎలా వాడుతారు? ఈ సమస్యను అధిగమించాలంటే వారికి పరికరాల పేర్లను మరచిపోకుండా ఉండేటట్లు నేర్పాలి అందుకోసమే ఈ ప్రయత్నం... హుర్రే!!! ఈ కృత్యం ద్వారా పిల్లలకి ప్రయోగశాల పరికరాల పేర్లు సుపరిచితమయ్యాయి 

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
















































