13, మార్చి 2016, ఆదివారం

పిల్లలు మరియు ఉపాధ్యాయులు తయారుచేసిన సైన్స్ నమూనాల ప్రదర్శన చిత్రమాలిక - మా బడిలో జాతీయ సైన్స్ దినోత్సవం 2016 సందర్భంగా .....

జాతీయ సైన్స్ దినోత్సవం 2016 సందర్భంగా ..... మా బడిలో పిల్లలు మరియు మేము అనగా సైన్స్  ఉపాధ్యాయులు కలిసి కొన్నిరోజుల ముందునుంచి సైన్స్ నమూనాలు తయారు చేయడం మొదలెట్టాము. నమూనాల ద్వారా పిల్లలకు సైన్సు పరిజ్ఞానం మరింత పెరుగుతుంది అన్న విషయంలో అతిశయోక్తి ఏమీలేదు. నమూనాల ద్వారా బోధించడం ద్వారా పిల్లలకు విషయాన్ని చక్కగా చెప్పవచ్చు, అలాగే పిల్లలు నమూనాలను చూసి స్వంతంగా  కొన్ని వాక్యాలు చక్కగా చెప్పగలరు మరియు వ్రాయగలరు. బట్టీ బోధనాభ్యసన నుంచి పిల్లలను దూరం  చేసి వారిని    సృజనాత్మక బోధనాభ్యసనకు చేరువచేయడానికి  ఈ నమూనాలు ఎంతగానో దోహదపడుతాయి. అందుకే పిల్లలకు అదివరకు లేని నమూనాల తయారి అలవాటును స్వయంగా ఉపాధ్యాయులం మేము చేసి చూపి వారిచేత చేయించడం జరిగింది. అలా తయారుచేసిన నమూనాలను జాతీయ సైన్స్ దినోత్సవం 2016 సందర్భంగా ప్రదర్శనకు ఉంచడం జరిగింది.
ఈ నమూనాలతో బాటు కల్యాణదుర్గం లోని వాసవి కాఫీ వర్క్స్  నాగరాజు గారి నుండి వారు సేకరించిన వివిధ దేశాల నాణేలు మరియు వివిధ రకాల స్వదేశీ నాణేలు ప్రదర్శనకు వుంచడం జరిగింది. దీనివల్ల పిల్లలకు ఒక హాబీ ని పరిచయం చేసి వారిని కూడా వివిధ రకాల హాబీలు అలవరచుకోమని చెప్పడం జరిగింది. ఈ సైన్స్  నమూనాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆరంభించిన గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారికి మరియు మా బడికి మానవ జీర్ణవ్యవస్థ నమూనాను తన కుమార్తె పేరుమీదుగా ఇచ్చిన శ్రీ  గోళ్ళ శేషాద్రి (లాయరు) గారికి, మా బడి పిల్లలకు హాబీలను పరిచయం చేయడానికి తాము సేకరించిన వివిధ దేశాల నాణేలను మా బడిలో ప్రదర్శనకు ఉంచడానికి ఇచ్చిన వాసవి కాఫీ వర్క్స్ నాగరాజు గారికి, ఈ ప్రదర్శనను తిలకించడానికి విచ్చేసిన శెట్టూరు, కల్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు  మండల ప్రధానోపాధ్యాయులకు , ఉపాధ్యాయులకు , విద్యార్థినీ విద్యార్థులకు  , పని ఒత్తిడిలో వున్నా మా పై ప్రత్యేక అభిమానంతో  వచ్చిన మా మిత్రులు  అక్బర్ వారి అధ్యాపక బృందంకు , లేపాక్షి ఉత్సవాల పనులలో అలసిపోయినా.. మమ్మల్నీ,   మా బడి పిల్లలను ప్రోస్తహించడానికి తీరిక చేసుకొని మరీ ఈ కార్యక్రమానికి వచ్చిన  ఆర్డీవో శ్రీ రామారావు గారికి , ఎమ్మార్వో మేడం గారికి , పాత్రికేయులకు , మామూలు పంథాలో జరిగే సైన్సు ప్రదర్శనలకు భిన్నంగా మా బడిలో సైన్స్ ప్రదర్శన  నిర్వహించడానికి సహాయ సహకారాలు మరియు అమూల్యమైన సూచనలు ఇచ్చిన విదేశీ, స్వదేశీ బ్లాగర్ మిత్రులకు మా బడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి  అందరికీ పేరుపేరునా  ధన్యవాదాలు. విద్యార్థినీ విద్యార్థులకు శుభాసిస్సులు.



































































9, మార్చి 2016, బుధవారం

మా బడిలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు - విద్య వైజ్ఞానిక అంశాల ప్రదర్శన చిత్రమాలిక ....


మా బడి ఉపాధ్యాయ బృంద సమిష్టి కృషితో , బ్లాగర్ మిత్రుల సహాయ  సహకారంతో  మరియు  మార్గదర్శకత్వంతో , బడి ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున గారు, గ్రామ సర్పంచ్ రామన్న గారు మరియు  లాయర్ శేషాద్రి గారు సమన్వయ సహకారంతో, ఆర్డీవో రామారావు గారి ప్రోస్తాహంతో,  ఈ సంవత్సరం మా బడిలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, వివిధ పాటశాలల నుండి వచ్చిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులకు, అలాగే మా  మిత్రులు డిగ్రీ కళాశాల బోటనీ అధ్యాపకులు  అక్బర్ మరియు వారి అధ్యాపక బృందానికి,  పాత్రికేయ మిత్రులకు  అందరికీ  జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తలపెట్టిననాటి నుంచి ముగిసేవరకూ ఎక్కడో ఖండాంతరాలలో వున్నా అనునిత్యం  ఫోన్ ద్వారా మార్గ నిర్దేశనం చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తన వంతు పాత్ర వహించిన  బ్లాగర్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.  రాబోయే సంవత్సరం ఈ జాతీయ సైన్సు దినోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకుంటామని  తెలియచేసుకుంటూ ....  























13, ఫిబ్రవరి 2016, శనివారం

ఆపరేషన్ నో యువర్ ఎమినెంట్ సైంటిస్ట్ ఫేస్ - 2 లో ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకున్న మా బడి పిల్లలు వాటి వివరాలు....

ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ లో భాగంగా 
ఈసారి నా  శ్రేయోభిలాషి, మార్గదర్శి, మరియు మారుమూల పల్లెల్లో, తండాల్లో కూడా జాతి నిర్మాతలయ్యే విద్యార్థులు ఉంటారని ప్రగాఢంగా నమ్మే ఎన్ ఆర్ ఐ మిత్రుడు  " ఏ.పి.జే.అబ్దుల్ కలాం" 'అగ్నిపథం' (విద్యార్థులకు ప్రత్యేకం - స్టూడెంట్ ఎడిషన్) పుస్తకాలను నాకు పంపమని హైదరాబాదు లోని తన మిత్రులు విజయ్ గారికి చెప్పడం జరిగింది. చాల అరుదుగా దొరికే ఈ పుస్తకాల కోసం ఎన్ ఆర్. ఐ . మిత్రులైన విజయ్ గారు హైదరాబాదు లోని అన్ని ప్రముఖ  పుస్తకాల షాపులను గాలించి గాలించి చివరకు ఒక్క షాపులో  వుంటే, వున్న అన్ని కాపీలను కొని నాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది.   మా బడి లో పిల్లలకు ఈ కలాం గారి అగ్నిపథం పుస్తకాలను చూపించి ఎవరైతే కనీసం 50 మంది శాస్త్రవేత్తల పేర్లు వారి ఆవిష్కరణలు నేర్చుకొని వ్రాస్తారో వాళ్ళకి బహుమతిగా ఇవ్వబడుతుందని చెప్పడం, కొందరు పిల్లలు నేర్చుకొని వ్రాసారు. అలా   ఈ అగ్నిపథం పుస్తకాల బహుమతి గెల్చుకొన్న పిల్లలకు  మా బడి ప్రధానోపాధ్యాయుల మరియు ఉపాధ్యాయుల  చేతులమీదుగాఎన్నారై గారి తరఫున అందచేసి, ఆ పుస్తకాన్ని చదివి వారి స్వంత మాటల్లో  ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలని, వ్రాయాలని చెప్పడం జరిగింది. దాని ఫలితంగా ఇప్పుడు అగ్నిపథం ని బహుమతిగా పొందిన పిల్లలే కాకుండా  చాలామంది పిల్లలు  ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి గురించి చక్కగా  మాట్లాడ గలిగే స్తాయికి మరియు  వ్రాసే స్తాయికి వచ్చారు. మలి ప్రయత్నంలో మరింత మంది పిల్లలు ఈ అగ్నిపథం పుస్తకాలను గెల్చుకొని   ఏ.పి.జే.అబ్దుల్ కలాం గురించి తెలుసుకొని  ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి తో మా బడి పిల్లలు అబ్దుల్ కలాం గారి మిస్సైళ్ళు గా మారి భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు అయ్యి వారి తల్లిదండ్రుల కలలు, మా కలలు, ఎన్ ఆర్ ఐ గారి కలలు నిజం చేసి ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ లక్ష్యాన్ని విజయవంతం చేస్తారని ఆసిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్న ఎన్నారై గారికి, ఈ కార్యక్రమంలో నేను సైతం సహకారానికి సదా సిద్ధం అని అగ్నిపథం పుస్తకాలను కొని పంపిన హైదరాబాదు లోని ఎన్నారై మిత్రులు విజయ్ గారికి  బడి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. పిల్లలకు సుభాశిస్సులు.