5, జులై 2015, ఆదివారం

గోళ్ళ శేషాద్రి గారి (న్యాయవాది, హైదరాబాదు హైకోర్ట్ కనుకూరు గ్రామస్థులు) కారణంగా జరిగిన కనుకూరు గ్రామ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చరిత్రలోనే అతి పెద్ద సమాజహిత మరియు పాఠశాల అభివృద్ధి కార్యక్రమం



నేను కొత్తగా పదోన్నతి మీద వెళ్ళిన తొలిరోజున  కనుకూరు గ్రామం లో కాకతాళీయంగా కలిసిన ఆ గ్రామానికి  చెందిన మొదటి వ్యక్తి శ్రీ గోళ్ళ శేషాద్రి గారు, ఆ క్షణంలో ఆ రోజున నాకు తెలియదు అతని గొప్పతనం. తరువాత తెలిసింది అతను మామూలు న్యాయవాది కాదని భారతీయ ఫౌండేషను ఫౌండర్ మరియు ట్రస్టీ అనీ గ్రామంలోని పురాతన శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ మరియు నవీనీకరణ భాద్యతలు ను గ్రామస్తులతో కలిసి స్వీకరించారని తెలిసింది. ఆ పనులలో  భాగంగానే శ్రీ గోళ్ళ శేషాద్రి గారు శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ముందు ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హైకోర్ట్ న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ జస్టిస్ చల్లా కోదండ రామ్ గారిని, హైకోర్ట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గౌరవనీయులు శ్రీ దుమ్మలపాటి శ్రీనివాసులు గారిని, హైకోర్ట్  బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఘంటా రామారావు  గారిని  ముఖ్య అతిధులు గా ఆహ్వానించారు. మారు మూల గ్రామానికి ఇంతటి విశిష్ట వ్యక్తులను ఆహ్వానిచడం వారు సమ్మతించి రావడమంటే మామూలు విషయం కాదు. కేవలం శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ముందు ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమమే కాకుండా ఆ విశిష్ట వ్యక్తుల తో పర్యావరణ హిత కార్యక్రమమైన  గుడి నుండి బడి వరకు మొక్కలు నాటే కార్యక్రమము మరియు రేపటి పౌరుల దిశానిర్దేసంకు తోడ్పడే  మా ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ విశిష్ట వ్యక్తుల రాకతో ప్రోటోకాల్ ప్రకారం కల్యాణదుర్గం ఆర్డీవో శ్రీ రామారావు గారు, ఎమ్మార్వో శ్రీమతి శ్రీవాణి గారు, ఎంపీడీవో శ్రీమతి  కమలమ్మ గారు, డిఎస్పి శ్రీ అనిల్ కుమార్ గారు, సివిల్ జడ్జి నాగరాజు గారు, పొలీస్ సిఐ మంసూరుద్దిన్ గారు, కనుకూరు గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారు, జడ్పటిసి, ఎంపీ టీసి, వచ్చారు వీరితో పాటూ  మా  పాఠశాల ఉపాధ్యాయ బృందం, పిల్లలు, వారి తల్లిదండ్రులు  మరియు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మా  పాఠశాలలో పిల్లలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిచిన అతిధులు తన స్వంత గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ గోళ్ళ శేషాద్రి గారిని ప్రశంసించారు. ఉన్నత  పాఠశాల కోసం రెండు ఎకారాల స్థలం ఉచితంగా ఇవ్వడం, శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చేయడం, మొక్కలు నాటడం వంటి సమాజ హిత కార్యక్రమాల ద్వారా గ్రామ అభివృద్ధి పథం లో పయనించడానికి శ్రీ గోళ్ళ శేషాద్రి గారు మార్గదర్శకులుగా వున్నారని కొనియాడారు .  గ్రామస్థులకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు దిశానిర్దేసం చేశారు భాద్యతలు గుర్తుచేశారు, అలాగే ఆర్డీవో రామారావు గారు మాట్లాడుతూ తన ప్రసంగంలో నేను గతంలో పనిచేసిన  పాఠశాలలో అభివృద్ధి పనులను అతిధులకు గ్రామస్థులకు శ్రీ గోళ్ళ శేషాద్రి గారికి తెలియచేసి వారి సహకారంతో ఈ  పాఠశాలలో కూడా నేను అభివృద్ధికి కృషి చేస్తానని సభాముఖంగా తెలియచేసారు అలాగే నా సహోద్యోగులు నాగేంద్ర రెడ్డి గారు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రైటర్ అని రిసోర్సుఫుల్ టీచర్ అని మిగిలిన వారుకూడా తెలిసినవారేనని వీరందరూ  పాఠశాల అభివృద్ధి కృషి చేయాలనీ కోరారు. పిల్లలతో ముచ్చటించి వారిలో స్పూర్తిని నింపారు, నాకు మా ఉపాధ్యాయ బృందానికి శ్రీ గోళ్ళ శేషాద్రి గారు, సర్పంచ్ రామన్న గారు, గ్రామ ప్రజల సహకారంతో  పాఠశాల అభివృద్ధి పథంలో తీసుకోనిపోగలమన్న నమ్మకం కుదిరింది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి కారకులైన శ్రీ గోళ్ళ శేషాద్రి గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియచేసుకుంటూ ...... 




































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి