29, డిసెంబర్ 2014, సోమవారం

మా బడి అభివృద్ధికి విరాళాలు అందజేస్తున్న బడి పూర్వ విద్యార్థులు (ప్రస్తుత ఉద్యోగస్తులు ), గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రుల ఫోటోలు...






మా బడిలో చదువు పూర్తి చేసుకొని, పై చదువులు చదివి  ప్రస్తుతం ఉద్యోగాలు చేసున్న వారితో విరాళాలు సేకరించి బడి అభివృద్ధికి వినియోగించాలని
బడి యాజమాన్య కమిటి మరియు బడి అభివృద్ధి కమిటి సంయుక్త సమావేశంలో తీసుకున్న
నిర్ణయం మేరకు బడి పూర్వవిద్యార్ధులను ( ప్రస్తుత ఉద్యోగస్తులను) కలిసి విరాళాలు అడగడం జరిగింది.
వారందరూ సానుకూలంగా స్పందించడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు
కూడా వుద్యోగస్తులతోపాటు తాముకూడా తమకు తోచినంత విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చి విరాళాలు
ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలతో అన్ని తరగతుల పిల్లలకు బెంచెస్ ఏర్పాటు చేయాలని తరువాత మిగిలిన
ఏర్పాట్లు చేయాలని బడి యాజమాన్య కమిటి మరియు బడి అభివృద్ధి కమిటి తీర్మానించింది.
బడి అభివృద్ధికి సహకరించిన పూర్వవిద్యార్ధులకు గ్రామస్తులకు ధన్యవాదాలు...

శ్రీ ధనుంజయ రెడ్డి విరాళము (సన్నకారు రైతు):- రూపాయలు.1500/-

శ్రీ వెన్నపూస లక్ష్మీనారాయణ రెడ్డి (పాల వ్యాపారి)విరాళము:- రూపాయలు.1500/-

శ్రీ తిప్పారెడ్డిపల్లి నారాయణ  రెడ్డి (రైతు)  విరాళము:- రూపాయలు.1500/-

శ్రీమతి అలివేలమ్మ విరాళము:- రూపాయలు.1000/-(ఈ అవ్వనుండి విరాళము వద్దన్నా వినకుండా ఇచ్చింది.)

శ్రీ సీతా రామిరెడ్డి గారు తన కూతురు(ఎక్సైజ్ కానిస్టేబుల్) తరఫున విరాళము:- రూపాయలు.3000/-

శ్రీమతి హేమలత (సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు) తరఫున ఆమె తండ్రిగారు విరాళము:- రూపాయలు.3000/-

శ్రీ వేణుగోపాల్ రెడ్డి (ఆర్మీ) శ్రీ నాగేంద్ర రెడ్డి (కానిస్టేబుల్) తరఫున వారి తండ్రి నాగలింగారెడ్డి  విరాళము:- రూపాయలు.3000/-

శ్రీ ఓబి రెడ్డి విరాళము(సన్నకారు రైతు) విరాళము:- రూపాయలు.1500/-

శ్రీమతి వెంకటేస్వరమ్మ (బడి యాజమాన్య కమిటి వైస్  ఛైర్మన్  విరాళము:- రూపాయలు.3000/-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి