రక రకాల పావురాలని పెంచడం, వాటికి ఆహారం వేయడం, పొదిగొచ్చిన పావురం పిల్లల్ని పెంచడం, పావురాలతో పందెములు వేయడం పిల్లలుండే గ్రామములో పెద్దవారికి ప్రవృత్తి. ఈ విషయాలన్నీ మా బడి పిల్లలు దగ్గరగా చూస్తున్నరన్న విషయం తెలిసిన నేను వారితొ పావురాల మీద ఒక ప్రాజెక్టు చేయమన్నాను దానితొ వారికి ఇష్టమైన ప్రాజెక్టు దొరికింది. పిల్లలు పావురాల్ని గమనిచడం అవి ఏ రకమైన పావురమో గుర్తించడం, వాటి ఆహారపు అలవాట్లను పరిశీలించడం, అవి ఎన్ని గుడ్లు పెడతాయి, ఎన్ని రొజులు పొదుగుతాయి, పొదిగొచ్చిన పిల్లలు ఎన్ని రొజులకు రెక్కలొచ్చి ఎగురుతాయి, వాటికి పెద్దవారు పందెములకు ఎలా శిక్షణ ఇస్తారు, పందేలలో ఎలా పాల్గొనిపిస్తారు అనే అనేక ఆసక్తికర విషయాలు వారు తెలుసుకొని వచ్చి నాకు వారి స్వంత మాటలలో తెలియచెసారు ఒక చక్కటి నివేదిక రూపొందిచారు, అంతేకాదు మేమూ ఆర్నిథాలజిస్టులౌతామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు....
24, జనవరి 2016, ఆదివారం
23, జనవరి 2016, శనివారం
మేమూ రాకెట్ ఇంజనీర్లౌతామంటున్న మా బడి పిల్లలు, ఆ దిశగా వారి తొలి అడుగులు
మన అబ్దుల్ కలాం గారి స్పూర్తి తో భారతదేశంలో ఇటీవల శ్రీహరికోట నుండి ఇస్రో శాస్త్రవేత్తలు పి. యస్. ఎల్. వి. రాకెట్ ద్వారా ప్రయోగించిన ఐ.ఆర్.యన్.యస్.యస్.1ఇ శాటిలైట్ గురించి పిల్లలకు వివరించి రెండు నిమిషాల నిడివి గల దాని వీడియోని చూపించి ఆ శాటిలైట్ వల్ల మన దేశానికి కలిగే ఉపయోగాలు తెలియచేసి వారికి రాకెట్ అంటే ఏమి, శాటిలైట్ అంటే ఏమి, మిస్సైల్ అంటే ఏమి మొదలైన విషయాలు తెలియచేయడం జరిగింది.అలాగే పి.యస్.ఎల్.వి. రాకెట్లకి జి.యస్.ఎల్.వి. రాకెట్లకి మధ్య గల తేడాలను వివరించి బ్లాక్ బోర్డ్ మీద రఫ్ గా రాకెట్ బొమ్మ వేసి చూపించడం జరిగింది, అలాగే మనం త్వరలో జరుపుకోబోయే జాతీయ సైన్స్ దినోత్సవం సదర్భంగా మనం రాకెట్ నమూనాలు చేద్దామని చెప్పాను. దీనితొ ప్రేరణ పొందిన పిల్లలు మరుసటి రోజు తమకు తోచినవిధంగా కలబంద చెట్ల ఆకులతో, పాత అట్టలతో రాకెట్ నమూనాలు చేసుకొచ్చారు. ఎటువంటి ఆధునిక సదుపాయలు లేని మారు మూల పల్లెలో నివసించే వారి సృజనకు ఆశ్చర్య పోయిన నేను వారికి మరి కొన్ని సూచనలిచ్చి మరింత మెరుగైన రాకెట్ నమూనలను తయారుచేయమన్నాను. త్వరలో సరికొత్త రాకెట్ నమూనలను చేసుకొస్తామని ధీమాగ చెప్పారు ఆ చిచ్చరపిడుగులు వాటి చిత్రాలే ఇవి చూడండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)