సరస్వతిదేవి ఆశీస్సులతో, మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలతో, సమాజ సహకారంతో, అధికారుల ప్రోత్సాహంతో ఈ విద్యా సంవత్సరంలో సరస్వతిదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేయడంతో మాబడిలోని అభివృద్ధి కార్యక్రమాలకు గొప్ప ముగింపు నిచ్చాము. ఈ సందర్భంగా విగ్రహ దాత శ్రీ రామన్జులరెడ్డి కుటుంబానికి, విగ్రహ ఏర్పాటుకు అవసరమైన కట్ట నిర్మాణానికి విరాళాలిచ్చిన బడియాజమాన్యకమిటి ఛైర్మన్ మరియు వైస్ ఛైర్మన్ శ్రీమతి లక్ష్మిదేవమ్మ, శ్రీమతి వెంకటేశ్వరమ్మ వీరి సోదరి శ్రీమతి వెంకటలక్ష్మమ్మ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు. విద్యాసంవత్సరం ప్రారంభంలోఅనుకున్నవిధంగా ప్రొజెక్టర్ ఏర్పాటు చేసుకుని పిల్లలందరికీ హ్యాండ్రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హిందీ నేర్పించడం,అలాగే పిల్లలందరికీ సమాజ సహకారంతో టై, బెల్ట్, షూ, బెంచెస్, ఏర్పాటు చెయ్యడం, బడి పరిసరాలలో బండలు నాటించి వాటిపైన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన సూక్తులని రాయించడం, పూల మొక్కలతో బడి తోటని ఏర్పాటు చేసుకోవడంతో బడి పరిసరాలను అందంగా ఆహ్లాదంగా మార్చడం , 6 నీళ్ళ కోలాయీలతో పిల్లలకోసం సింక్ ఏర్పాటుచెయ్యడం, క్విజ్, స్పెల్లింగ్ ఛాలెంజ్ కార్యక్రమాలు ప్రణాళికా బద్దంగా నిర్వహించడం, జాతీయ పండుగుల సందర్భంగా పిల్లలకు చిత్రలేఖన, వక్రుత్వ వ్యాసరచన పోటీలను నిర్వహించి పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడటం, చివరగా బడికి, బడి పరిసరాలకు పవిత్రత చేకూరేవిధంగా సరస్వతిదేవి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడంతో ఈవిద్యాసంవత్సర అభివృద్ధి కార్యక్రమాలకు కి విజయవంతంగా గొప్పముగింపు పలికమన్నతృప్తి మాకు మిగిలింది. రాబోయే విద్యాసంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి మాబడి పిల్లల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని సరస్వతి దేవి విగ్రహప్రతిష్టేకాదు మా ప్రభుత్వ బడి ప్రతిష్టను కూడా మా ఉపాధ్యాయ బృంద కృషితో వున్నత స్థాయికి తీసుకేల్తామని తెలియ చేస్తూ .......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి