మాబడి (నూతన ఒరవడి) లోగో ఆవిష్కరణ,
మాబడి (నూతన ఒరవడి) లోగో ఆంతర్యం, చిత్రాలు.. .
ప్రతి దేశానికి, ప్రతి సంస్థకు ఒక లోగో(చిహ్నం) వుంటుంది. అలాగే మా పాఠశాలకు కూడా ఒక లోగోను రూ పొందిచాలనుకున్నాను. అనుకున్నదే తడవుగా మా బడి లక్ష్యాన్ని, పనితీరును వ్యక్తీకరించేవిధంగా మా బడి లోగోను(చిహ్నాన్ని) నేను మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించాను. ఈ లోగోలో పుస్తకం, సూర్యుడు, ఏ.బి.ఎల్., సి.ఏ.ఎల్.,సి.సి.పి., సి.సి.ఈ., అనే ఆంగ్ల అక్షరాలు,9మంది బాలురు,9మంది బాలికలు వుండి వీటి చుట్టూ "మా బడి నూతన ఒరవడి" అని మా పాఠశాల పేరు వుంటుంది.
పుస్తకం:- ఇది విజ్ఞాన కోశం. సాక్షాత్ సరస్వతి దేవి సమానం.
సూర్యుడు:- సరస్వతి దేవి సమానమైన పుస్తకంలో విజ్ఞానమైతే వుంటుంది కాని దాన్ని పిల్లలకి అర్థవంతంగా, సమగ్రంగ అందించే వారు కావాలి. ఆ పనిని చక్కగా నిర్వర్తించే వారే ఉపాధ్యాయులు. అటునంటి ఉపాధ్యాయులందరు మా ఈ లోగోలోఉన్న సూర్యునితో సమానం.
ఏ.బి.ఎల్., సి.ఏ.ఎల్.,సి.సి.పి., సి.సి.ఈ., అనే ఆంగ్ల అక్షరాలు:- పుస్తకంలో ఉన్న విజ్ఞానాన్ని పిల్లలకు సూర్యుని లాంటి ఉపాధ్యాయులు అర్థవంతంగా, సమగ్రంగ అందించాలన్నా మదింపు చేయాలన్నా కొన్ని పద్ధతులు ఎంచుకోవాలి . అటువంటి బోధనా పద్ధతును సూచించేవే ఈ ఆంగ్ల అక్షరాలు.
ఏ.బి.ఎల్. అంటే "యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ." దీన్నే తెలుగులో "కృత్యాధార అభ్యాసన" అంటారు. మా బడిలో చిన్న పిల్లలకు ప్రతి బోధనాంశమును కృత్యాధార పద్దతిలోనే మేము బోధించడం అలాగే పిల్లలు అభ్యసించడం జరుగుతుంది. కృత్యాధార అభ్యసనానికి అవసరమైన అన్ని బోధనోపకరణాలను మేము ప్రత్యేకంగా స్వయంగా రూపొందించుకొని మేము ఉపయోగించడం పిల్లలతో ఉపయోగించడం జరుగుతోంది.
సి.ఏ.ఎల్. అంటే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్. దీన్నే తెలుగులో కంప్యూటర్ ఆధారిత అభ్యసనం అంటారు. ఈ సందర్భంగా కాల్ ప్రోగ్రాం కింద కంప్యూటర్లు మా బడికి వచ్చేటట్లు చేసిన మా మండల విద్యాధికారి శ్రీ గురు ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా బడికి కంప్యూటర్లు వచ్చిందే తడవుగా వాటిని సద్వినియోగం చేసుకుంటూ నేను సుమారు 300 పై చిలుకు చిన్న చిన్న పవర్ పాయింట్ పాఠాలు నేను తయారుచేసి నేను వాటిని ఉపయోగించి పిల్లలతోటి వాటిని స్వయంగా ఉపయోగింపచేసి సత్ఫలితాలు రాబట్టటం జరిగింది. గ్రామాలలో నిరంతరం వుండే కరెంటు కోతలను అధిగమించి కంప్యూటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి సమాజ భాగస్వామ్యంతో ఇన్వర్టర్ ను, అలాగే అన్ని తరగతులకు ఒకేసారి స్పోకెన్ ఇంగ్లీష్ ను, హిందీని, అందమైన చేతివ్రాతను ఇతర ముఖ్యాంశాలను చక్కగా నేర్పడానికి ప్రొజెక్టర్ ను ఏర్పాటు చేసుకోని కంప్యూటర్ ఆధారిత అభ్యసనంను మరింత మెరుగుపరచడం జరిగింది.
సి.సి.పి. అంటే చైల్డ్ సెంటర్డ్ పెడగాగి. దీన్నే తెలుగులో విద్యార్థి కేన్ద్రీకృత విద్యాబోధన అని అంటారు. అంటే బోధనలో మా తరగతిలో అతి ముఖ్యమైన వారు పిల్లలే. విద్యార్థి కేంద్రంగానే బోధనాభ్యసన జరుగుతుంది.
సి.సి.ఈ. అంటే కంటిన్యుయస్ కామ్ప్రిహెన్సివ్ ఎవాల్యుఏషన్ దీనినే తెలుగులో నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఇది మన దేశ వ్యాప్తంగా పాఠశాలల్లొ అవలంభిన్చబడుతున్న ఒక నూతన విద్యా విధానం. మేము నిరంతరం సమగ్ర మూల్యాంకన మే కాకుండా నిరంతరం సమగ్ర విద్యనూ కూడా అందచేసే విధంగా మా స్థాయిలో మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము.
ఇవన్నీ తెలిపే విధంగా మేము ఏ.బి.ఎల్., సి.ఏ.ఎల్.,సి.సి.పి., సి.సి.ఈ., అనే ఆంగ్ల అక్షరాలను మా బడి లోగోలో వుంచడం జరిగింది.
9మంది బాలురు, 9మంది బాలికలు:- ఈ 9మంది బాలురు,9మంది బాలికలు ఎల్కేజీ, యూకేజి మొదలు 1 నుంచి 7 తరగతుల బాలబాలికలను ప్రతిబింబిస్తాయి . అలాగే ఈ బాలబాలికలు పుస్తకంలోని విజ్ఞానాన్ని (సూర్యుని కిరణాలతో విచ్చుకున్న మొగ్గలు లాగ) ఉపాధ్యాయుల ఏ.బి.ఎల్., సి.ఏ.ఎల్.,సి.సి.పి., సి.సి.ఈ అనే బోధనా పద్ధతుల బోధనలతో వికసించి సమగ్ర వికాసాన్ని పొంది పరిపూర్ణతతొ ఉన్నత పాఠశాలలకు సిద్ధమౌతారని సూచిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి