6, మే 2016, శుక్రవారం

... మదిలో అలముకొన్న చీకట్లు తొలగాలంటే మంచి పుస్తకం చదవాలి. అందుకోసం నా బడి నూతన ఒరవడి చిరు ప్రయత్నం


గదిలో అలముకొన్నచీకట్లు తొలగాలంటే దీపంవెలిగించాలి, మదిలో అలముకొన్నచీకట్లు తొలగాలంటే మంచి పుస్తకం చదవాలి.
మా బడి పిల్లలకు వేసవి సెలవుల్లో విభిన్న కార్యక్రమం:
మాబడి పిల్లలకు విలువలు, విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం, వ్యక్తిత్వవికాసం మరియు అకుంటిత పట్టుదల వంటి అంశాల ను పెంపొందించడానికి "నాబడి నూతన ఒరవడి" బ్లాగర్ మిత్ర బృందం, నేను, మా బడి ఉపాధ్యాయ బృందం కలిసి పిల్లలకు ఉపయుక్తమైన ఏడు రకాల పుస్తకాలను 25 సెట్లను కొని (1. అగ్నిపథం చిన్నపిల్లల ప్రత్యేక ప్రచురణ - ఆత్మవిశ్వాసం కొరకు, 2. యల్లాప్రగడ సుబ్బారావు జీవిత చరిత్ర - విజ్ఞానం కొరకు, ౩. స్వామీ వివేకానంద గారి సక్సెస్ అఫ్ ది స్టూడెంట్ - వ్యక్తిత్వ వికాసం కొరకు, 4. స్వామీ వివేకానంద ధీర యువతా... మేల్కోండి - మానసికవికాసం కొరకు, 5. సత్యసాయి బాబాగారి చిన్నకథ - విలువల కొరకు, 6. బాల భక్తులు - అకుంటిత పట్టుదల కొరకు, 7. ధీర నరేంద్రుడు వివేకానంద జీవితమ్ - మానసిక ధైర్యం కొరకు) బడి చివరి పని దినమున బడి పిల్లలందరినీ 25 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపుకు ఈ 7పుస్తకాల సెట్ ను అందచేసి రొటేషన్ పద్ధతిలో వేసవి సెలవుల్లో వీలున్నపుడల్లా చదవాలని సూచించడం జరిగింది. ఈ వేసవి సెలవులను మంచి పుస్తకాలు చదవడం ద్వారా వారి మదిలో అలముకొన్న చీకట్లు తొలగి పోయి, పిల్లలు రాబోయే విద్యా సంవత్సరంలో నూతనోత్సాహంతో ఉంటారని ఆశిస్తూ విద్యార్థులకు ఆశిస్సులు. మరి పిల్లల చేత వేసవి సెలవుల్లో ఇలాంటి ఒక సత్క్రుత్యం చేయించవచ్చు అని తెలియచేసి మా చేత మా బడి పిల్లల చేత ఇంత మంచి కార్యక్రమం చేయిస్తున్నబ్లాగర్ మిత్రులకు ఇందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులుకు ప్రత్యేక ధన్యవాదములు.