13, ఫిబ్రవరి 2016, శనివారం

ఆపరేషన్ నో యువర్ ఎమినెంట్ సైంటిస్ట్ ఫేస్ - 2 లో ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకున్న మా బడి పిల్లలు వాటి వివరాలు....

ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ లో భాగంగా 
ఈసారి నా  శ్రేయోభిలాషి, మార్గదర్శి, మరియు మారుమూల పల్లెల్లో, తండాల్లో కూడా జాతి నిర్మాతలయ్యే విద్యార్థులు ఉంటారని ప్రగాఢంగా నమ్మే ఎన్ ఆర్ ఐ మిత్రుడు  " ఏ.పి.జే.అబ్దుల్ కలాం" 'అగ్నిపథం' (విద్యార్థులకు ప్రత్యేకం - స్టూడెంట్ ఎడిషన్) పుస్తకాలను నాకు పంపమని హైదరాబాదు లోని తన మిత్రులు విజయ్ గారికి చెప్పడం జరిగింది. చాల అరుదుగా దొరికే ఈ పుస్తకాల కోసం ఎన్ ఆర్. ఐ . మిత్రులైన విజయ్ గారు హైదరాబాదు లోని అన్ని ప్రముఖ  పుస్తకాల షాపులను గాలించి గాలించి చివరకు ఒక్క షాపులో  వుంటే, వున్న అన్ని కాపీలను కొని నాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది.   మా బడి లో పిల్లలకు ఈ కలాం గారి అగ్నిపథం పుస్తకాలను చూపించి ఎవరైతే కనీసం 50 మంది శాస్త్రవేత్తల పేర్లు వారి ఆవిష్కరణలు నేర్చుకొని వ్రాస్తారో వాళ్ళకి బహుమతిగా ఇవ్వబడుతుందని చెప్పడం, కొందరు పిల్లలు నేర్చుకొని వ్రాసారు. అలా   ఈ అగ్నిపథం పుస్తకాల బహుమతి గెల్చుకొన్న పిల్లలకు  మా బడి ప్రధానోపాధ్యాయుల మరియు ఉపాధ్యాయుల  చేతులమీదుగాఎన్నారై గారి తరఫున అందచేసి, ఆ పుస్తకాన్ని చదివి వారి స్వంత మాటల్లో  ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలని, వ్రాయాలని చెప్పడం జరిగింది. దాని ఫలితంగా ఇప్పుడు అగ్నిపథం ని బహుమతిగా పొందిన పిల్లలే కాకుండా  చాలామంది పిల్లలు  ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి గురించి చక్కగా  మాట్లాడ గలిగే స్తాయికి మరియు  వ్రాసే స్తాయికి వచ్చారు. మలి ప్రయత్నంలో మరింత మంది పిల్లలు ఈ అగ్నిపథం పుస్తకాలను గెల్చుకొని   ఏ.పి.జే.అబ్దుల్ కలాం గురించి తెలుసుకొని  ఏ.పి.జే.అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి తో మా బడి పిల్లలు అబ్దుల్ కలాం గారి మిస్సైళ్ళు గా మారి భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు అయ్యి వారి తల్లిదండ్రుల కలలు, మా కలలు, ఎన్ ఆర్ ఐ గారి కలలు నిజం చేసి ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ లక్ష్యాన్ని విజయవంతం చేస్తారని ఆసిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్న ఎన్నారై గారికి, ఈ కార్యక్రమంలో నేను సైతం సహకారానికి సదా సిద్ధం అని అగ్నిపథం పుస్తకాలను కొని పంపిన హైదరాబాదు లోని ఎన్నారై మిత్రులు విజయ్ గారికి  బడి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. పిల్లలకు సుభాశిస్సులు. 






























7, ఫిబ్రవరి 2016, ఆదివారం

కార్టీజియన్ డైవర్ కృత్యం ద్వారా ఆర్కిమెడిస్ మరియు పాస్కల్స్ ప్రిన్సిపుల్స్ అవగాహన చేసుకుంటున్న మాబడి బోసులు, కలాంలు....









జిల్లేడు కాయలు, గన్నేరు పువ్వులు, నీలగిరి ఆకులతో నిజమైన రామచిలుకలేమో అనే బ్రమ కలిగించే అచ్చమైన రామకచిలుకల నమూనాలు రూపొందించిన మా బడి ఆర్నితాలజిస్ట్ లు ......







కూల్ డ్రింక్ స్ట్రాలు, కలర్ టేపు ఉపయోగించి తరంగ ప్రయాణం విధానాన్ని వివరించే కృత్యాన్ని స్వయంగా చేసుకొని ప్రత్యక్షంగా చూసి తెలుసుకొంటున్న మా బడి పిల్లలు.....