5, జూన్ 2015, శుక్రవారం

నా బడి నూతన ఒరవడి పార్ట్ - 2

సుమారు పదహారున్నర సంవత్సరాల సర్వీసును ప్రాథమిక తరగతుల(1-5 తరగతులకు) ఉపాధ్యాయుడిగా పూర్తి చేసిన తరువాత, నాకు ఈ నెల అంటే మే 2015 న ఉన్నత తరగతులకు (6-10 తరగతులకు) జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పదోన్నతి లభించింది.  కొత్త బడి, కొత్త పిల్లలు, కొత్త సహోద్యోగులు, కొత్త విధులు చేపట్టబోతున్నా నన్న సంతోషం ఒకపక్క, మరో పక్క   జూన్ 15 నుంచి నేను నా పాత బడిని, పాత పిల్లలను, పాత సహోద్యోగులను ఒక్క మాటలో చెప్పాలంటే నా కలల సాకార ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తున్నందుకు భాద "పరిహార- ఉపగమ" సంగర్షణ.  కాకపొతే నా కలల ప్రపంచ మైన బడి లో నాణ్యమైన విద్య (గుణాత్మక విద్య) మరియు మెరుగైన  భౌతిక వసతుల కల్పన, బడి పిల్లల బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం  చేయడం, ప్రభుత్వ బడి పట్ల గ్రామస్థుల దృక్పథంలో మార్పు  తీసుకు రావడంలో (నా సహోద్యోగులు   నరసింహులు గారు(హెడ్మాస్టర్), సర్దార్ వలి గారు, పరిమళ గారు, చింతా లక్ష్మీ నారాయణ గారు , బడి అభివృద్ధి కమిటి సభ్యులు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు, మండల అభివృద్ధి అధికారి శ్రీ గురు ప్రసాద్ గారు, మాజీ మండల అభివృద్ధి అధికారి శ్రీ చంద్ర శేఖర్ గౌడ్ గారు, విద్యార్థి నేస్తం బృందం, సర్వ శిక్షా అభియాన్ అధికారులు, మాజీ సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీ రామారావ్ గారు,   నా మిత్రులు,మా బడి  సాముదాయక బడుల్లోని ఉపాధ్యాయులు, బుక్కరాయసముద్రం మండలంలోని ఉపాధ్యాయులు,  నవీన విద్య మాస పత్రిక , పాత్రికేయులు, బ్లాగర్ మిత్రులు, కుటుంబ సభ్యులు .... ఇలా ప్రతిఒక్కరి సహకారంతో ప్రోస్తాహంతో  ) విజయవంతమైనానన్న సతోషంతో, సంతృప్తితో నా బడి నూతన ఒరవడి పార్ట్ - 1 ను  వదలి వెళుతున్నాను.   కొత్త బడిలో  కొత్త పిల్లలతో, కొత్త విధులలో నేను రాణించాలని నాబడి నూతన ఒరవడి మలి భాగంలో విజవంతం కావాలని నాబడి నూతన ఒరవడి(పార్ట్-2) ని విజయవంతంగా నిర్మించాలని అనుకుంటూ ..... ....
ఇక నుంచి నాబడి నూతన ఒరవడి(పార్ట్-2) లో ఉన్నత తరగతులకు చెందిని కొత్త పోస్టులు ఉంటాయని బ్లాగర్ మిత్రులకు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

4, జూన్ 2015, గురువారం

ఓల్డ్ అడ్వర్ టైజ్ మెంట్ బోర్డ్స్ తో న్యూ ఆల్ఫా బెట్ స్ట్రోక్స్...

ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయునిగా నేను రూపొందించిన  చివరి బోధనోపకరణం . వార్షిక మదింపు మరియు గ్రేడింగ్ పనుల కారణంగా దీన్ని నేను పూర్తి చేసి బడి పిల్లలతో ఉపయోగించ 
లేకపోయాను. ఐతే వేసవి సెలవులలో దీన్ని నేను ఇంటి దగ్గర పూర్తిచేసాను మా స్నేహితుల పిల్లలతో దీన్ని ప్రాథమికంగా ఉపయోగించి చూసాను.